calender_icon.png 14 November, 2024 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్‌పై దాడి వెనుక బీఆర్‌ఎస్ కుట్ర

13-11-2024 01:27:10 AM

ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): వికారాబాద్ కలెక్టర్, అధికారు లపైన దాడు లు బీఆర్‌ఎస్ పార్టీ ప్రేరేపితమేనని పీసీసీ ఉపాధ్యక్షుడు, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్ నాయకులే ఈ దారుణానికి పాల్పడ్డార ని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. ఫార్మా కంపె నీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ హింసాత్మకంగా మారడం వెనుక బీఆర్‌ఎస్ కుట్ర దాగుందన్నారు.  

సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నాయకులు ఇలాంటి ఘటనలకు తెరలేపి ప్రజాస్వామ్యానికి సవాల్ విసిరారన్నారు. కొడంగల్ అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్న బీఆర్‌ఎస్ నాయకుల ఉద్దేశం ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.