మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): లగచర్ల, దిలావర్‌పూర్‌లో అధికారులపై దాడులు, గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్‌ఎస్ కుట్ర దాగి ఉన్నదని మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి ఆరోపించారు. గాంధీభవన్‌లో వైశ్య కార్పొరే షన్ చైర్మన్ కల్వ సుజాతతో కలిసి గురువారం ఆమె మీడియాతో మా ట్లాడారు.
హాస్టల్‌లో జరుగుతున్న ఘటనల వెనుక ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కుట్ర ఉందని, ఆయన కనుస న్నల్లోనే ఇదంతా జరుగుతున్నదన్నా రు. రాష్ట్రంలో జరుగుతున్న అలజడులకు బీఆర్‌ఎస్ నేతలే కారణమని శోభారాణి విమర్శించారు. రాజకీయాల కోసం బీఆర్‌ఎస్ నేతలు ఎవ రినైనా బలి చేస్తారని సుజాత ఆరోపించారు.
అధికారులను పంపించి ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న కుట్రల ను బయటపెట్టాలని సీఎంను ఆమె కోరారు. ఈ ఘటనకు ముందే నమస్తే తెలంగాణ దినపత్రిక రిపోర్టర్, మరో ముగ్గురు అక్కడ భోజనం చేశారని, వారికి ఎందుకు ఫుడ్ పాయిజన్ కాలేదని ప్రశ్నించారు.