హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)పై నార్సింగ్ పోలీస్ స్టేషన్(Narsingi Police Station) లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసు(Formula-E Car Racing Case)లో రేవంత్ రెడ్డిన ముద్దాయిగా చేర్చాలిని బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సీనియర్ నేతల బృందం ఎస్‌హెచ్‌వోకు ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై గతకొన్ని రోజుల క్రితం ఫార్ములా-ఈ కార్ రేస్‌లో విదేశీ సంస్థకు నిధులు మళ్లించి రాష్ట్ర ఖజానాకు నష్టం చేశారంటూ ఆరోపిస్తూ కేసు నమోదైన విషయం తేలిసిందే. కేటీఆర్(KT Ramarao) తో పాటు ఎంఏయూడీ మాజీ స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్(Former MAUD Special CS Arvind Kumar), హెచ్ఎండీఏ సీఈ బీఎల్ఎన్ రెడ్డి(HMDA CE BLN Reddy)పైనా ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగానే ఈడీ విచారణ జరుపుతోంది. ఫార్ములా -ఈ కార్ రేస్ ను రేవంత్ రెడ్డి ఏకపక్షంగా రద్దు చేయడంతో తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు వెనక్కిపోయాయని మండిపడ్డారు. దీంతో రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతిన్నదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో రేవంత్ రెడ్డిని ముద్దాయిగా చేర్చి ఆయనను విచారించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు.