అయనపై కేసు నమోదు చేయండి
నార్సింగి పీఎస్ లో బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు
రాజేంద్రనగర్,(విజయక్రాంతి): ఫార్ములా-ఈ కార్ రేస్(Formula-E Car Race)లో అసలు ముద్దాయి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అని బీఆర్ఎస్(BRS) సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల రాష్ట్రానికి రావలసిన పెట్టబడులు వెనక్కి పోయాయాని ఆయన మండిపడ్డారు. ఆయన తీరుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని మండిపడ్డారు. ఈ విషయంలో వెంటనే పూర్తిస్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన మంగళవారం ఉదయం నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి తీరుతో రాష్ట్ర ఖజానాకు కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని ఆరోపించారు.
గత ప్రభుత్వం మొబిలిటీ వ్యాలీ అనే ప్రాజెక్టు తేవడానికి కృషి చేసిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అది వెళ్లిపోయిందని మండిపడ్డారు. దీంతో రాష్ట్ర ఖజానాకు కోట్ల రూపాయలు నష్టం జరిగిందని విమర్శించారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ నిర్వహించిందన్నారు. అది నాలుగు సార్లు ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ నిర్వహించాల్సి ఉందని, సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యలతో మొబిలిటీ వ్యాలీ పోయిందన్నారు. ప్రభుత్వానికి పన్ను కడుతున్న ఒక వ్యక్తిగా, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని మండిపడ్డారు. సీఎం చర్యతో తెలంగాణలో వేలాదిమంది ఉద్యోగాలు రాలేదన్నారు.
ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి పాత్ర అధికంగా ఆయనపై విచారణ జరిపి కేసు నమోదు చేయాలని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి రాకముందు ఐపీఎస్ అధికారిగా ట్రైన్ బ్రాంచ్ డీసీపీగా అడిషనల్ డీజీపీగా, వార్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఐక్యరాజ్యసమితిలో పనిచేశానని తెలిపారు. ఈ కార్ రేస్ వ్యవహారంలో తాను పూర్తిస్థాయిలో పరిశోధన చేసినట్లు తెలిపారు. నేపథ్యంలో రేవంత్ రెడ్డి పై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ కురువ విజయ్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.