calender_icon.png 20 September, 2024 | 2:13 PM

బీఆర్‌ఎస్ వ్యాఖ్యలు సరికావు

17-09-2024 04:13:04 AM

పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు  

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): తాము అధికారంలోకి వచ్చిన వెం టనే సచివాలయం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్‌ఎస్ లీడర్లు వ్యాఖ్యలు చేయడం సరికాదని, అలాంటి ఆ లోచనలుంటే మానుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు హితువు పలికారు. రాజీవ్ విగ్రహం జోలికి వస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఆయన హె చ్చరించారు. సోమవారం హనుమంతరావు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన కృషి ఎనలేనిదని, అలాంటి వ్యక్తి విగ్రహం కూలగొడ తామంటే చూస్తూ ఊరుకోమన్నారు.

దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణత్యాగాలు చే సిందని, సోనియాగాంధీ వల్లే ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందన్న విషయాన్ని మరిచిపోవొద్దన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బీసీ సా మా జికవర్గానికి చెందిన మహేశ్‌కుమార్‌గౌడ్‌ను అధిష్ఠానం నియమించడం అభినందనీయమన్నారు. ఈ నెల 19న రవీంద్రభారతిలో మహేశ్‌కు సన్మానసభ ఏర్పాటు చేసిన ట్లు చెప్పారు. కార్యక్రమానికి పార్టీ పెద్దలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.

‘ప్రజాపాలన’కు రావాలని కేంద్రమంత్రులకు లేఖలు: ఎంపీ మల్లు  

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెం బర్ 17న నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్రమంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు సీ ఎం రేవంత్‌రెడ్డి లేఖలు రాసినట్లు ఎంపీ మ ల్లు రవి పేర్కొన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో ఎమ్మెల్యే మందుల సామేల్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రా న్ని పదేండ్లు పాలించిన బీఆర్‌ఎస్ సెప్టెంబర్ 17ను అధికారికంగా గుర్తించకపోవడం విచారకరమన్నారు.

కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు కలిసి సెప్టెంబర్ 17న తెలంగాణకు విముక్తి కల్పించాయని ఎమ్మెల్యే సామేల్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ పాచికలు పారవని, పా ర్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ వల్లే కొన్ని సీ ట్లు వచ్చాయన్నారు. పాడి కౌశిక్‌రెడ్డి అనే వ్య క్తి కాంగ్రెస్ పార్టీలో కోవర్టుగా పని చేశారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై మంత్రివర్గ కమిటీ వేయడం శుభపరిణామని, త్వరలోనే వర్గీకరణ అమలవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డను టీపీసీసీ అధ్యక్షుడిని చేసిందని, బీఆర్‌ఎస్‌కు ఆ పార్టీ అధ్యక్షుడిని మార్చే ధైర్యం ఉందా అని ఎంపీ మల్లు   ప్రశ్నించారు.