calender_icon.png 9 January, 2025 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సమస్యలు మరిచి ఫార్ములా ఈ రేసు కేసు వెతుకులాట

08-01-2025 10:11:59 PM

బీఆర్ఎస్ చెన్నూర్ ఇన్చార్జి డాక్టర్ రాజా రమేష్...

మందమర్రి (విజయక్రాంతి): రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలను మరిచి ఫార్ములా ఈ రేసు కేసుపై దృష్టి సారించి పాలన గాలికొదిలేసిందని బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గం ఇన్చార్జి డా.రాజా రమేష్ ఆరోపించారు. రైతు అవగాహన కార్యక్రమంలో భాగంగా చెన్నూర్ మండలంలోని ఆస్నాద గ్రామంలో రైతన్నలకు ప్రభుత్వం బాకీ పడ్డ 17వేల 500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గ్రామంలోని రైతులను కలిసి ప్రభుత్వం రైతాంగానికి చేసిన అన్యాయంపై రైతులకు ప్రజలకి ఆవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మండిపడ్డ డాక్టర్ రాజా రమేష్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులను మోసం చేస్తున్న విషయం ప్రజలు, రైతన్నలు మర్చిపోయేందుకే ఫార్ములా ఈ రేసు కేసు ముందుకు తీసుకొచ్చారని విమర్శించారు.

ప్రజాపాలన పేరుతో ముందుకొచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ని తిట్టడం కేటీఆర్ ని కేసుల్లో ఇరికించి జైలుకు పంపడం ఉద్దేశంతో రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుందని మండిపడ్డారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుపడతామని నమ్మకంతో గెలిపిస్తే అన్నదాతలకు శటగోపం పెట్టారని ఆయన విరుచుకుపడ్డారు. యాసంగి పంటకు 7500 చొప్పున ఇచ్చేంత వరకి కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంత్రి బాపు, చారి, సమ్మిరెడ్డి, ప్రశాంత్ లు పాల్గొన్నారు.