calender_icon.png 27 April, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాడవాడలో బీఆర్ఎస్ సంబురాలు

26-04-2025 07:37:34 PM

జడ్చర్లలో గులాబీ జెండాను ఎగరవేసిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి...

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): కానీ విని ఎరుగని రీతిలో బిఆర్ఎస్ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం జడ్చర్ల మున్సిపాలిటీ కావేరమ్మ పేట, రాఘవేంద్ర కాలనీ, జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామం లో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా బిఆర్ఎస్ జెండా ను మాజీ మంత్రి డా.సి.లక్ష్మా రెడ్డి ఆవిష్కరించారు. వరంగల్ లో ఆదివారం జరగనున్న సభ అంగరంగ వైభవంగా జరుగుతోందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పెట్టిన పథకాలను అమలు చేయలేకపోతుందని విమర్శించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యతిరేకత వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏం కోల్పోయారో తెలుసుకున్నారని, స్వచ్ఛందంగా టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలకు వరంగల్ వచ్చేందుకు ఆతృత కనబరుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.