27-04-2025 08:00:25 PM
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..
హుజురాబాద్ (విజయక్రాంతి): దేశం విషాదంలో ఉంటే టిఆర్ఎస్ మాత్రం రజతోత్సవ సభతో రాజకీయ పండుగ చేసుకుంటుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి(BJP District President Gangadi Krishna Reddy) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీ 178 బూతులో ఆదివారం ప్రసారమైన ప్రధాని మంకీ బాత్ కార్యక్రమం వీక్షించారు. నిర్వహించుకోవడం పహల్గం ఉగ్రదాడితో భారతీయుల రక్తం మరిగిపోతుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీ 178వ పోలింగ్ బూత్ లో బిజెపి శ్రేణులతో కలిసి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆదివారం ప్రసారమైన ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడితో భారతీయుల రక్తం మరిగిపోతుందని, దేశ ప్రజల మనసులో ఉన్న భావనను ప్రధాని మోదీ మన్ కి బాత్ సందర్భంగా తెలియజేశారని పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ దేశ, ప్రపంచవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని భారతీయులందరూ కోరుకుంటున్నారని అన్నారు.
గత ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఉగ్రదాడిని ఖండించి, కనీసం నిరసన వ్యక్తం చేయడానికి బయటికి రాలేక పోయారని అన్నారు. రాజతోత్సవ వేడుకలతో సంబరాలు చేసుకోవడానికి కెసిఆర్ బయటికి వచ్చారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, కంకణాల రమాదేవి, ఇంచార్జీ ప్రవీణ్ రెడ్డి, పట్టణ సీనియర్ నాయకులు ఆకుల రాజేందర్, జీడి మల్లేష్, ఆవాల రాజిరెడ్డి, దొంతుల రాజు కుమార్, బచ్చు శివన్న, మోతె స్వామి, పల్లపు రవి, కైలాసకొటి గణేష్, ఇటుకాల స్వరూప, ముకుందా తదితరులు పాల్గొన్నారు.