calender_icon.png 20 October, 2024 | 6:03 PM

కేటీఆర్ పిలుపు.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు

20-10-2024 11:22:41 AM

హైదరాబాద్: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసాపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాల్లో నేతలు, పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టనున్నారు. వానాకాలం రైతు భరోసా ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళనలకు దిగనుంది.

శనివారం వ్యవసాయం శాఖ మంత్రి తుమ్మల శనివారం మీడియాతో మాట్లాడుతూ...  పంటలు పండే భూములకే రైతు భరోసా ఇస్తామని, బీడు భూములకు రైతు భరోసా ఉండదని తుమ్మల స్పష్టం చేశారు. 2 లక్షల పైనున్న డబ్బులు చెల్లిస్తే వారికి మాఫీ చేస్తామని చెప్పారు. రబీ నుంచి పంటల భీమాకు టెండర్ల పిలుస్తామని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీపై వరంగల్ లో రాహుల్ గాంధీ డిక్లరేషన్ ఇచ్చారని చెప్పిన మంత్రి తుమ్మల ప్రతిపంటకు బీమా ప్రీమియం ప్రభుత్వమే కడుతోందన్నారు. రైతులు పండించిన ప్రతి పంటలను కేంద్రం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతుల్ని రుణ విముక్తుల్ని చేస్తున్నామని చెప్పారు. రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భుజాన వేసుకున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.