calender_icon.png 17 March, 2025 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా హామీలపై ప్రశ్నిస్తే సస్పెన్షన్ వేటా..?

15-03-2025 11:11:16 PM

పెన్‌పహాడ్‌ వ్యాప్తంగా బి.ఆర్ఎస్ శ్రేణులు నిరసనగలం

దిష్టిబొమ్మలు దగ్ధం

పెన్‌పహాడ్‌: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గారెంటీలపై ప్రజలకు ఇచ్చిన హామీలు రేవంత్ సర్కార్ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ఈ విషయమై అసెంబ్లీ సమావేశాలు సాక్షిగా మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి(Suryapet MLA Jagadish Reddy) ప్రశ్నిస్తే ఉద్దేశపూర్వకంగానే సస్పెన్షన్ వేటు వేయడం అప్రజానస్వామికమని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మండలంలోని ఆయా గ్రామాలలో నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెన్న సీతారాం రెడ్డి, మిర్యాల వెంకటేశ్వర్లు, తూముల ఇంద్రసేనారావు, పర్రెడ్డి సీతారాం రెడ్డి, నాతల జానకి రాం రెడ్డి, జుట్టు కొండ గణేష్  రణపంగ సైదులు నెమ్మది నగేష్ తదితరులు ఉన్నారు.