30-04-2025 01:18:19 AM
తూతూమంత్రంగా కాంగ్రెస్ విచారణ: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏన్డీఎస్‌ఏ నివే దిక దేశంలోనే అతి పెద్ద ఇంజనీరింగ్ మో సాన్ని బట్టబయలు చేసిందని, బీఆర్‌ఎస్ సర్కారు కూలిపోయే ప్రాజెక్టును నిర్మిస్తే దీనిపై కాంగ్రెస్ పార్టీ తూతూమంత్రంగా వి చారణ చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లో ఎన్డీస్‌ఏ తాజా నివేదిక సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చిందంటూ మంగళ వారం తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో డిజైన్, ని ర్మాణం, నిర్వహణలో ఘోర లోపాలు చో టుచేసుకోగా, కాంగ్రెస్ ప్రభుత్వం మా త్రం సరైన విచారణ లేకుండా పరిస్థితిని మరింత దిగజార్చిందన్నారు.
సీడబ్ల్యూసీ పూర్తి అనుమతి రాకముందే బ్యారేజీల నిర్మాణం ప్రా రంభించడం, నిర్మాణ సమయంలో అనధికార మార్పులు, భౌగోళిక పరీక్షలు లేకుండానే లొకేషన్ మార్పులతో ప్రాజెక్టు పునాదులను కుదేలు చేశాయని నివేదిక పేర్కొందన్నారు.