calender_icon.png 28 October, 2024 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రప్రభుత్వంపై బీఆర్‌ఎస్ బోగస్ ప్రచారం

10-08-2024 01:22:07 AM

పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వంపై బీఆర్‌ఎస్ బోగస్ ప్రచారం చేస్తోందని, ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా.. ఆ పా ర్టీ నేతల నైజం మారలేదని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రా మ్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శుక్ర వారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుతో పాటు బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్రప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌కు తాగునీటీని తీసుకురావడంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. మం జీరా, కృష్ణా, గోదావరి, ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు జలాలు తీసుకురాలేకపోయిందన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనపైనా బీఆర్‌ఎస్ నేతలు బురద జల్లే ప్ర యత్నం చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల హయాంలో ఎన్ని ఎంవోయూలు జరిగాయి..? వాటి లో ఎన్ని కంపెనీలు తెలంగాణకు వచ్చా యి? ఏయే కంపెనీలు ఎన్నెన్ని పెట్టుబడులు పెట్టాయి..? ఎంతమందికి ఉపాధి కల్పించాయి..? అనే అంశాలపై తాము చర్చకు సిద్ధమని, కేటీ ఆర్ సిద్ధంగా ఉన్నారా? అని సవాల్ విసిరారు. మెడికల్ అడ్మిషన్ల విషయంలో తీసుకొచ్చిన జీవో 33పై మాజీ మంత్రి హరీష్‌రావు అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. ఈ జీవోతో తెలంగాణ బిడ్డలకు అదనంగా 299 సీట్లు వస్తాయనే విష యాన్ని బీఆర్‌ఎస్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.