calender_icon.png 25 February, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్, బీజేపీ డీల్

25-02-2025 01:52:14 AM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత.. మీ ఓటు ఎవరికో చెప్పాలి

ఫోన్ ట్యాపింగ్ నిందితులను భారత్‌కి తేలేరా? బీఆర్‌ఎస్ స్కామ్‌ల ఫైళ్లను ఈడీ తీసుకెళ్లింది 

రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఈటల అడ్డుకుంటున్నారు

పట్టభద్రులు గమనిస్తున్నారు..

ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డిని గెలిపిస్తే సమస్యల పరిష్కారం

నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి

నిజామాబాద్/మంచిర్యాల/కరీంనగర్ ఫిబ్రవరి 24: (విజయ క్రాంతి): ఎమ్మె ల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మూడు బహిరంగ సభల్లో ప్రసం గించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటు బీఆర్‌ఎస్ అటు బీజేపీని తూర్పారపడుతూ.. ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యా యని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితు లు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరి కా నుంచి భారత్ రాకుండా బీజేపీ సహకారాన్ని బీఆర్‌ఎస్ తీసుకున్నదని సీఎం ఆరోపించారు.

పక్కా డాక్యుమెంట్లతో వెళ్లిన విద్యార్థులను అమెరికా ప్రభు త్వం సంకెళ్లు వేసి తిరిగి పంపిస్తుంటే, ఫోన్ ట్యాపింగ్ నిందితులు ఎందుకు భారత్‌కు రాలేకపోతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వారు తిరిగివస్తే విచారణ జరిపి వారిని సత్వరం చంచల్‌గూడ జైలుకు పంపించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.  గొర్రెల స్కామ్ కేసు, ఈ ఫార్ములా రేస్‌తో పాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని ప్రాజెక్టుల అన్ని కుంభకోణాల ఫైళ్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీసుకెళ్లిందని..

ఇప్పటివరకు ఆ కేసులు ఏమయ్యాయో ప్రజలకు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదంతా పరోక్షంగా బీజేపీకి, బీఆర్‌ఎస్ మద్దతు ఇవ్వడం వల్లనే జరుగుతున్నదని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తమ అభ్యర్థిని నిలపలేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు, ద్వేషం, అసూయతో బీజేపీని గెలిపించేందుకు బీఆర్‌ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, చీకటి ఒప్పందం చేసుకున్నారని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత.. ఓటు ఎవరికి వేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ నేతలు కిషన్ రెడ్డి ఈటల అడ్డుకుంటున్నారని అన్నారు. బీజేపీకి పట్టభద్రుల ఓటు అడిగే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధ్ది, సంక్షేమానికి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, పట్టభద్రుల ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగుల, పట్టభద్రుల తరుపున పోరాడుతారని సీఎం చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తుంటే బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.  బీఆర్‌ఎస్ దోరణి.. సత్రంలో ఉచితంగా భోజనం పెడుతుంటే వెనకటికెవడో ఆ భోజనానికి కూడా నెల్లూరు పెద్దారెడ్డి రికమండేషన్ లెటర్ తెచ్చుకున్నటుందని సీఎం చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా నిలపెట్టలేకపోయిన బీఆర్‌ఎస్ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పడం హస్యస్పదంగా ఉందని అన్నారు.

ఫాం హౌస్‌లో కూర్చొని కేసీఆర్ పొంకనాలు కొడుతన్నారని ఆయన అన్నారు. బూటులో రాయి తీసుకోలేని వాడు ఏటిలో ఉన్న పెద్ద బండరాయిని బయటికి తీస్తానని బయలుదేరినట్టుగా ఉంది కేసీఆర్ ధోరణి అని చెప్పారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని, ఆయన ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్య వారధిగా ఉండి ప్రజా సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తారని తెలిపారు. సంవత్సర కాలంలో ఉద్యోగులు, టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు.

పదేళ్లలో టెట్, డీఎస్సీ నిర్వహించకుండా కేసీఆర్ ప్రభుత్వం తండాలలో, గ్రామాల్లో పాఠశాలలను మూసివేస్తే, సంవత్సర కాలంలోనే టెట్ నిర్వహించి, డీఎస్సీ నిర్వహించి 11 వేల మందికి ఉద్యోగాలిచ్చామని అన్నారు. 5 లక్షల మందికి ఉద్యోగులకు 20వ తేదీ వరకు కూడా జీతాలు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల మొదటి తారీఖునే జీతం ఇస్తున్నామని సీఎం చెప్పారు.