calender_icon.png 27 April, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ బైక్ ర్యాలీ

26-04-2025 10:50:33 PM

మంచిర్యాల (విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తి  చేసుకున్న సందర్భంగా మంచిర్యాల పట్టణంలో శనివారం మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఐబి చౌరస్తా నుంచి వెంకటేశ్వర టాకీస్, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ముకరం చౌరస్తా, శ్రీనివాస టాకీస్ మీదుగా ఐబీ చౌరస్తా వరకు సాగింది. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, టీబీజీకేఎస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.