* పథకాల అమలు కార్యక్రమంలో ఉద్రిక్తత
* ఎమ్మెల్యే పల్లాపై కోడిగుడ్లు విసిరిన కాంగ్రెస్ కార్యకర్తలు
* కార్యక్రమానికి హాజరుకాని మంత్రి పొంగులేటి
జనగామ, జనవరి 26 (విజయక్రాంతి): జనగామ జిల్లా పెద్దపహాడ్ గ్రామంలో ఆదివారం నాలుగు పథకాల అమలు కార్యక్రమం రచ్చకు దారి తీసింది. నాలుగు పథకాల ప్రారంభానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరుకావాల్సి ఉంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు జనగామ మండలంలోని పలువురు బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు.
మంత్రి మధ్యాహ్నం 3:30 గంటలకు రావాల్సి ఉండగా.. అంతుకుముందే మధ్యా హ్నం 2:20 గంటలకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేరుకున్నారు. ఆయన బీఆర్‌ఎస్ కార్యకర్తల అరెస్టుపై డీసీపీ రాజమ హేంద్రనాయక్‌ను నిలదీశారు. అరెస్టు చేసిన వారందరినీ కార్యక్రమానికి అనుమతించాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశా రు.
పోటీగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అంటూ నిననదించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి మైక్ అందుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. సభ సజావుగా సాగేలా సహకరించాలని ఇరు పార్టీల కార్యకర్తలను కోరారు. ఆ తర్వాత స్టేజీ దిగి కుర్చీలో కూర్చున్నారు. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మె ల్యేపై కోడిగుడ్లు విసిరేశారు. ఆయన సహచరులు రక్షణగా ఏర్పడటంతో కోడిగుడ్లు ఇతరు ల మీద పడ్డాయి.
ఓ న్యూస్ చానెల్ రిపోర్టర్ కంటికి గుడ్డు తగలడంతో తీవ్ర గాయమైంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. పల్లాను పోలీసులు సముదాయించి అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత ఆర్డీవో గోపి రాం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నడిపించారు. మంత్రి పొంగులేటి సభకు గైర్హాజరయ్యారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే ఆయన సభకు రాకుండా వెళ్లిపోయినట్లు సమాచారం.
పంచాయితీ చేయడానికే పల్లా వచ్చాడు : కొమ్మూరి
పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తోన్న పథకాలను చూసి ఓర్వలేక ఎలాగైనా పంచాయితీ పెట్టాలనే దురాలోచనతోనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన కార్యకర్తలను గొడవకు ఉసిగొల్పాడు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఎన్నడూ ఇలాంటి కార్యక్రమం చేయలేదు. అందుకే ఆయనకు కళ్లమంట. పల్లా రౌడీలా వ్యవహరించడం బాధాకరం.
కావాలనే మమ్మల్ని కొట్టారు: పల్లా
నేను స్థానిక ఎమ్మెల్యేగా ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లాను. మేం సభ ముం దు సైలెంట్‌గా కూర్చుంటే కాంగ్రెస్ కార్యకర్తలు మా కార్యకర్తలను కొట్టారు. చాలా మందికి దెబ్బలు తాకాయి. పోలీసులు వాళ్లను చెదరగొట్టకుండా బీఆర్‌ఎస్ కార్యకర్తలపైనే లాఠీచార్జి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రౌడీ రాజకీయం చేస్తోంది.