08-04-2025 01:04:44 AM
హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): సన్న బియ్యం పంపిణీ, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలు అమలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే.. బీజేపీ, బీఆర్‌ఎస్ ఓర్వలేకపోతున్నాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కంచ గచ్చిబౌలి భూములకు హెచ్‌సీయూకి ఎలాంటి సం బంధం లేదని విద్యార్థులు, ఉపాధ్యాయులకు తెలుసునని, కానీ.. వారిని రెచ్చ గొట్టి లబ్ధిపొందాలని బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కుట్రలకు తెరలేపాయని ఆరోపించారు. ఫేక్ వీడియోలు, చిత్రాలు సృష్టించి రెండు పార్టీ నేత లు ఏఐసీసీ నేతలు రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌కు ట్యాగ్ చేస్తున్నారని దుయ్యబట్టా రు.
వర్సిటీ భూముల విషయంలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఏమీ ప్రకటిం చకుండానే, ఆమె పేరిట ఊహాగానాలను ప్రచా రం చేశారని మండిపడ్డారు. వర్సిటీ భూ సమస్యలపై విద్యార్థులకు ఏమా త్రం అవగాహన లేదని, విద్యార్థులు ప్రతిపక్షాల కుట్రకు బలికావొద్దని హితవు పలికారు.
హెచ్‌సీయూ తరలి స్తున్నారనే ప్రచారం కొత్తగా మొదలైందని, అవ న్నీ కేవలం ఊహాగానాలేనని తేల్చిచెప్పారు. ప్రైవేటు కంపెనీకి కేటాయించిన భూములను ప్రభుత్వం తిరిగి తీసుకుని, అభివృద్ధి చేస్తామంటే ప్రతిపక్షాలకు వచ్చిన ఇబ్బందేంటో తెలియడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.