మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్, బీజేపీ జెండా లు వేరైనా.. ఎజెండా మాత్రం ఒక్కటేనని మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభరాణి విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన తప్పులను తమ ప్రభుత్వం సరిచేసే పనిలో ఉందన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే అప్పులపాలు చేశారని విమర్శించారు.
కేసీఆర్ రెండు నాలుకల మాటల గురించి చెబితే లెక్కలేనన్ని ఉన్నాయన్నారు. పదేళ్లు బీఆర్‌ఎస్ ప్రజాద్రోహం చేసిందని, దానిని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్లోకి బావ, బావమరుదులు వస్తున్నారని విమర్శించారు. దళితులకు మూడు ఎక రాల భూమి ఇవ్వలేదని, దళిత సీఎం ను కూడా చేయలేదన్నారు. బీజేపీ ఛార్జిషీట్‌ను కిషన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కి ఇచ్చారని శోభరాణి విమర్శించారు.