calender_icon.png 31 January, 2025 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి, అక్రమాల్లో బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే

30-01-2025 12:43:07 AM

కరీంనగర్, జనవరి 29 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల అవినీతి అక్రమాలను వాళ్లే స్వయంగా బట్టబయలు చేశారని, ఆనాటి వాటాదారులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ సునీల్రావు ఒక్కటై ఒక్కు పార్టీ అయ్యాడని కుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు.

బుధవారం ఆయన కరీంనగర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పనుల్లో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని గతంలో సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేకసార్లు కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. పనుల నాణ్యతపై, అశాస్త్రీయ పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన ద్వారా చూపించారు.

మాజీ మేయర్ సునీల్రావుతో కలిసి దోపిడీకి పాల్పడ్డ ఆనాటి ఎంపీ, కొత్త కేంద్ర మంత్రి బండి సంజయ్ నేడు ఒకే పార్టీగా కలవడం ఇది ముందే ఊహించిందేనని, ఎప్పటినుంచో వారి చీకటి ఒప్పందంలో భాగమే ఈ కలయిక అని అన్నారు. పార్కులు, ఐలాండ్స్ నిర్మాణంలో భారీ అక్రమాలు జరిగాయని, దుపింగ్యార్డుకు 16 కోట్లు కేటాయిస్తే 16 గంటలు కూడా పనిచేయలేదని ఆయన పేర్కొన్నారు.