24-02-2025 12:32:31 AM
ఎస్సీ వర్గీకరణను సుగమం చేశాం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కృషి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కరీంనగర్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఒకటే నని, తమకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకటేనంటూ బీజేపీ హస్తం పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎవరు ఎవరితో ఉన్నా రో తేల్చుకుందామంటూ కమలం పార్టీకి సవాల్ విసిరారు.
ఎంపీ ఎన్నికల్లో ఎవరు ఎవరికి సాయం చేశారో ప్రజలకు స్పష్టంగా తెలుసునన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసమే బీఆర్‌ఎస్ అభ్యర్థిని నిలపలేదని ఆరోపించారు. అనేక మాటలు చెబుతున్న బీజేపీ.. బీసీ రిజర్వేషన్లపై తమ వైఖరేమిటో స్పష్టం చేయలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు 50% దాటొద్దన్న రాజ్యాంగ నిబంధనను సవరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందా అని ప్రశ్నించా రు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కమిషన్ వేసి కులగణనపై సర్వే చేశామని, బీసీల కు న్యాయం చేసేందుకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగ మం చేశామని స్పష్టం చేశారు.
ఈ రెండు ప్రధాన అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. ఎన్ని కల్లో ఇచ్చిన హామీప్రకారం ఉద్యోగాల కల్పనకు జాబ్ క్యాలెండర్ ప్రకటించామని, ఇప్పటికే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ఆగిపోయిన డీఏలలో ఒక డీఏను ఉద్యోగులకు ఇచ్చినట్టు చె ప్పారు. 317 జీవో పుణ్యం బీజేపీదేనని, దానికి సహకరించించిది బీఆర్ ఎస్ కాదా బీజేపీ సమాధానం చె ప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జవాబుదారీతనంతో డీఎస్సీ నిర్వహించి పదివేల టీచర్ పోస్టులు భర్తీ చేసిందన్నారు.
గ్రూప్ పరీక్షను అడ్డుకోవడానికే బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రయత్నించాయని ఆరోపించారు. రాబోయే కాలంలో పట్టభద్రులకు ఏం చేస్తారో చెప్పని బీజేపీ, కాంగ్రెస్‌పై దుష్ప్రచారం చేసి విజయం సా ధించాలని చూసోతందన్నారు. తె లంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మాని ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. కార్య క్రమంలో కాంగ్రెస్ జిల్లా కమిటీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మె ల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ప్ర భుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అ డ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, హుజూరాబాద్ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్, కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేంద ర్‌రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ పాల్గొన్నారు.