18-02-2025 12:54:51 AM
*మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్
*రాష్ట్ర ఖజానా ఖాళీ అయినప్పటికిని సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం
* నిజామాబాద్ విలేకరుల సమావేశంలో ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు
నిజామాబాద్ ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి): నిరుద్యోగులను బిజెపి టిఆర్‌ఎస్ పార్టీలు మోసం చేస్తున్నాయని నిరుద్యో గులను మోసం చేసే పార్టీలు కేవలం ఈ రెండే అని నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యా ఫోఖ్యా నించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన సోమవారం ప్రసంగించారు. బిఆర్‌ఎస్ బిజెపి పార్టీలు లోపాయి గారి ఒప్పందంతో ఉన్నాయని అందుకే టిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మంత్రి జూపల్లి ఆరోపించారు.
ఎమ్మెల్సీ అని ఎన్నికల్లో బి ఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టకపోవడంతోటే స్పష్టమైందన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను ఎందుకు నిలబెట్టడం లేదని అందుకు గల కారణాలు ఏంటి అని ఆయన బిఆర్‌ఎస్ పార్టీ ని ప్రశ్నించారు. బిజెపి బీఆర్‌ఎస్ పార్టీలకు బీసీ కులగణపై విమర్శించే మాట్లాడే నైతిక హక్కు వారికి లేదన్నారు తెలంగాణలో బిజెపి పార్టీ వల్ల ప్రజలకు మేలు జరిగిందేమీ లేదని తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం కావడానికి బిజెపి పార్టీ ప్రధాన కారణం అని బిజెపి పార్టీ కేవలం మతతత్వాన్ని రెచ్చగొట్టేందుకే పని చేస్తోందని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు.
రాహుల్ గాంధీ కుటుంబం త్యా గాల కుటుంబమని గాంధీ కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపి పార్టీకి లేదని ఆయన అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయా లని పట్టబద్రులకు ఆయన పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎంతో గొప్పగా ఉందన్నారు. కెసిఆర్ మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేశారని అప్పుల కుప్పలు పేరుకుపోయాయని ప్రస్తుతం ప్రజ లకు సంక్షేమ ఫలాలు అందించడానికి ఈ అప్పులు అడ్డంకులుగా మారాయని జూపల్లి తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతటి ఆర్థిక దుర్బర పరిస్థితిలో ఉన్న సంక్షేమ కార్యక్ర మాలను తమ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కాగా అమలు చేస్తున్నామ న్నారు. రాష్ట్ర ఖజానా ఇబ్బందులు ఉన్నా కూడా ఉద్యోగులకు మొదటి రోజునే జీతాలు ఇస్తున్నామని అలాగే ఉద్యోగులకు ప్రమోషన్లు కూడా ప్రతి నియోజకవర్గంలో ఇస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ లను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.
కెసిఆర్ అవినీతి అప్రజా స్వామికి రాచరిక కుటుంబ పాలనను చూసి గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని జూపల్లి జోస్యం చెప్పారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం తెలియాలంటే కాంగ్రెస్కు పట్టభద్రులు ఓటేయాలని ఆయన పట్టభద్రులకు మరోసారి పిలుపునిచ్చారు కులగన సర్వే పక్కాగా జరిగిందని సర్వేకు హాజరు కాని వారికై రీ సర్వే చేస్తున్నామన్నారు కేసీఆర్ సర్వేకు చట్టపరంగా గుర్తింపు లేదని ఆయన తెలిపారు.
పుడతాం చేపట్టిన సర్వేను పక్కాగా చట్టబద్ధంగా చేస్తున్నామన్నారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని గంటపదంగా జూపల్లి చెప్పారు తెలంగాణలో కులగన ఆదర్శంగా తీసుకొని కేంద్రం దేశవ్యాప్తంగా కులగన చేపట్టాలన్నారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన రాహుల్ గాంధీ కుటుంబం గురించి కులం మతం గురించి మాట్లాడటం సరికాదని జూపల్లి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పీఎం పదవి తీసుకోకుండా రాహుల్ గాంధీ సోనియాలు పదవి త్యాగం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఈ సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి వ్యవసాయ రైతు కమిషన్ సభ్యుడు గడువు గంగాధర్ మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఆర్మూరు నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి తహర్ అభినందన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి నిజాంబాద్ నగర నుడా చైర్మన్ కేశ వేణు కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు నియోజకవర్గ ఇన్చార్జిలు కార్యకర్తలు పాల్గొన్నారు