15-03-2025 12:46:39 AM
కరీంనగర్, మార్చి 14 (విజయ క్రాంతి): బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం కరీంనగర్ లో బి.అర్.ఎస్ నగర శాఖ తెలంగాణ చౌక్ లో చేపట్టిన ప్రభుత్వ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ చౌక్ లో ప్రభుత్వ దిష్టిబొమ్మను బి.అర్.ఎస్ నేతలు దహనం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు.
బి.అర్.ఎస్ నేతల చేతుల్లోంచి దిష్టిబొమ్మను పోలీసులు లాగేందుకు యత్నించగా ఇరువర్గాలు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఎట్టకేలకు పోలీసులు దిష్టిబొమ్మను లాక్కొని వాహనంలో తరలించారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ప్రజాస్వామ్య విరుద్ధమని, ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా అడ్డుకున్న పోలీసుల తీరుపై బి.అర్.ఎస్ నేతలు మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ , మైనారిటీ అధ్యక్షుడు మీర్ శౌకత్ ఆలి, విద్యార్థి అధ్యక్షుడు బొంకూరి మోహన్, శాతవాహన యూనివర్సిటీ అధ్యక్షుడు చుక్క శ్రీనివాస్, వాజీద్, సతీష్, చేతికింది చంద్రశేఖర్, జెల్లోజి శ్రీనివాస్,మహేష్,అజయ్, ఖదీర్, ఇర్ఫాన్, నబీ, నిజాం, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు