పార్టీల జాబితాలో టాప్ 2
- 2023-24లో బీఆర్‌ఎస్‌కు రూ.580 కోట్ల విరాళాలు
- రూ. 2,224 కోట్లతో అగ్రస్థానంలో బీజేపీ
- రూ.289 కోట్లతో మూడోస్థానంలో కాంగ్రెస్
న్యూఢిల్లీ, డిసెంబర్ 26: విరాళాల విషయంలో కాంగ్రెస్ పార్టీని భారత రాష్ట్రీయ సమితి (బీఆర్‌ఎస్) వెనక్కి నెట్టింది. ఎన్నికల సందర్భంగా 2023-24 సంవత్సరంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌కు రూ.580కోట్ల విరాళాలు అందా యి. దీంతో అత్యధిక విరాళాలు పొందిన పార్టీల జాబితాలో బీఆర్‌ఎస్ రెండో స్థానంలో నిలిచింది.
ఈ జాబితాలో రూ. 2,224 కోట్లతో బీజేపీ అగ్రస్థానంలో ఉంది. కాంగ్రెస్‌కు కేవ లం రూ.289కోట్ల విరాళాలు అందడంతో ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఎన్నికల సందర్భంగా పార్టీలకు అందిన విరాళాల సమాచారాన్ని తాజాగా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది.
ఆ డేటా ప్రకారం 2023 దాతల నుంచి రూ.20వేలు అంతకంటే ఎక్కువ విరాళాల రూపంలో బీజేపీ రూ. 2,244కోట్లు అందుకుంది. కాంగ్రెస్‌కు అంతకుముందు ఏడాది అందిన విరాళాలతో పోల్చితే బీజేపీకి వచ్చిన విరాళాలు ఏకంగా 776.82శాతం ఎక్కువ ఉండటం గమనార్హం. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలకు ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచే అత్యధిక విరాళాలు అందాయి.
ఈ సంస్థ బీజేపీకి రూ.723కోట్ల విరాళాలు ఇవ్వగా కాంగ్రెస్ రూ.156కోట్లు ఇచ్చింది. అలాగే ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి బీఆర్‌ఎస్, వైసీపీలకు కూడా విరాళాలు వెళ్లాయి. ఈ సంస్థ బీఆర్‌ఎస్‌కు రూ. 85కోట్లు, వైసీపీకి 62.5కోట్ల విరాళా లు అందజేసింది. 2023 ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.11.1కోట్ల విరాళాలు వచ్చాయి.
అంతకుముందు ఏడాది ఈ పార్టీకి రూ.37.1కోట్ల విరాళాలు వచ్చినట్టు ఈసీ వెల్లడించిన సమాచారం అధారంగా తెలుస్తుంది. సీపీఐ గత ఏడాది రూ.6.1కోట్ల విరాళాలు పొందగా ఈ ఏడాది మాత్రం రూ.7.6కోట్లను అందుకుంది. కాగా ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు రద్దు చేసిన నేపథ్యంలో పార్టీలకు అందిన విరాళాల సమాచారాన్ని ఈసీ వెల్లడిస్తుంది.