09-04-2025 10:21:46 PM
మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్ రావు..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఈ నెల 27న వరంగల్ లో జరుగుతున్న BRS పార్టీ ఆవిర్భవ, రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన జిల్లా బిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ క్రమంలోని కొత్తగూడెం నియోజకవర్గ జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తలు సమావేశం కొత్తగూడెంలోని జిల్లా BRS కార్యాలయం నందు ఏర్పాటు చెయ్యడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు శ్రీ వర్ధిరాజు రవిచంద్ర, జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, పాల్గొంటారని పేర్కొన్నారు. కావున BRS పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తప్పక హాజరు కావలసిందిగా పిలుపునిచ్చారు.