29-03-2025 08:55:59 PM
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్..
కడ్తాల్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా విఫలమయ్యారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో శనివారం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు పరమేష్, మాజీ జడ్పిటిసి దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా జైపాల్ యాదవ్ మాట్లాడారు. నియోజకవర్గంలో బిఆర్ఎస్ బలోపేతంపై ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.
కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారని అయన గుర్తు చేశారు. అబద్దాల మాటలతో ప్రజలను కాంగ్రెస్ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారని జైపాల్ యాదవ్ అన్నారు. ఏప్రిల్ 2న మాజీ మంత్రి హరీష్ రావు కడ్తాల్ మండలం చరికొండ, బోయిన్ గుట్ట, ముద్విన్ గ్రామాల్లో పర్యటన ఉందని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ సర్పంచి లక్ష్మీ నర్సింహారెడ్డి, మాజీ ఉప సర్పంచి రామకృష్ణ పాల్గొన్నారు.