02-04-2025 10:00:08 PM
సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సన్న బియ్యం కార్యక్రమానికి ప్రజలు స్వదినియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్ అన్నారు. బుధవారం తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే తో కలిసి ఆసిఫాబాద్ పట్టణంలోని టిఆర్ నగర్ , రావుల వాడ , జనకాపూర్ రేషన్ షాపులలో అదేవిదంగా మండలంలోని ఖప్రి రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడు సన్న బియ్యం తీసుకోవాలని సుచించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ షాపుల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.