10-04-2025 12:00:00 AM
లబ్ధిదారుడి ఇంట్లో సన్న బియ్యం భోజనం చేసిన కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): సన్నబియ్యం పంపిణీతో పేద ప్రజలకు లబ్ది చేకూరుతుందని, ఈ పథకం పేదలకు ఓ వరం లాంటిదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం తలమడుగు మండ లం ఝరి గ్రామంలో రేషన్ షాప్ ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం సన్న బియ్యం లబ్ధిదారు పెందుర్ యాదవ్‌రావ్, కౌసల్య బాయి ఇంటిలో కుటుంబ సభ్యుల తో కలసి కలెక్టర్ భోజనం చేశారు.
కుటుంబ సభ్యులను కలెక్టర్ సన్న బియ్యం గురించి బియ్యం ఎలా ఉన్నాయి, అన్నం రుచికరం గా ఉందా అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం పంపిణీతో తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని, అన్నం రుచికరంగా ఉందని, బియ్యం చాలా బాగున్నాయని లబ్ధిదారులుడు తెలిపారు. కడుపునిండా భోజ నం చేస్తున్నామని, సన్న బియ్యం లభించడం మా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.
అధిక డబ్బులు వెచ్చించి బియ్యాన్ని బయట కొనుగోలు చేయకుండా ఆర్థిక వెసులు బాటు కలుగుతుందన్నారు. ఈ పథకాన్ని అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంత రం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 356 రేషన్ షాపులకుగాను 6 లక్షల 32 వేల రేష న్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందన్నారు.
ఏప్రిల్ 1వ తేదిన ప్రారంభించి ఈ రోజు వరకు ఇప్పటి వరకు తొమ్మిది రోజులలో 70 శాతం సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తం గా 4,127 మెట్రిక్ టన్నుల బియ్యం, అదనంగా కొత్తగా 14,322 మంది చేరడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నాణ్యత గల సన్న బియ్యం పంపిణీపై ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వాజిద్, సివిల్ సప్లై మేనేజర్ సుధా, తహసీల్దార్ రాజ్ మోహన్, డిఆర్డీఓ రవిందర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.