calender_icon.png 18 April, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తి కోసం సొంత తమ్ముడిని హత్య చేసిన అన్న

09-04-2025 11:06:03 PM

నిందితునికి జీవిత ఖైదు..

రూ 5 వేల రూపాయల జరిమాన..

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి..

కామారెడ్డి (విజయక్రాంతి): ఆస్తి కోసం అన్నను హత్య చేసిన తమ్ముని ఉదాంతం కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామంలో ఇంటి స్థలం కోసం గొడవపడి సొంత తమ్ముడిని హత్య చేసిన నిందితుడికి కోర్టు హాజరు పరిచారు. వాదోపవాదాలు విన్న తర్వాత నిందితునికి జీవిత ఖైదీతో పాటు 5000 జరిమానా విధించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం తెలిపారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. 2021 మే ఐదున జరిగిన సబేర బేగం భర్త మహమ్మద్ కాజా వృత్తి కూలి పని చేసుకుంటున్నాడు. పిట్లం గ్రామంలో వెయ్యి గజాల ప్లాటు కలదు అని ఇట్టి వెయ్యి గజాల ప్లాటు ఆస్తికి సంబంధించిన తన వాటాను పంచి ఇవ్వమని తన రెండవ కుమారుడు అయిన మహమ్మద్ షాదుల్ షాదుల్లా (నిందితుడు) గత నాలుగు సంవత్సరాల నుండి నాతో గొడవ పడుతూ ఉన్నాడు.

అదే విషయంలో తన చిన్న కొడుకు మహమ్మద్ ముజీబ్(మృతుడు) అతనితో గొడవలు వద్దని ఎప్పుడు నచ్చజెప్పుతు ఉండేవాడు. ఆస్తి విషయంలో చిన్న తమ్ముడు అయినా ముజీబ్ ఎప్పుడు అడ్డు వస్తున్నాడని మనస్సులో పెట్టుకొని  ఎట్లైనా అతడిని అడ్డు తొలగించుకోవాలని ఉద్దేశంతో చంపాలని అనుకోని రంజాన్ పండగ కు  సబేర బేగం అందరినీ ఇంటికి పిలవగా ఇదే అణువుగా చేసుకొని 2025 మే నా షాదుల్లా ఆస్తి కోసం గొడవ పడి  తన వెంట తీసుకువచ్చిన కత్తితో ముజీబ్ ని ఎడమచేత్తో గట్టిగా పట్టుకొని కుడి చేతిలో ఉన్న కత్తితో ముజీబ్ కడుపులో ఒక్కసారిగా పొడవుగా ముజీబ్ అక్కడే కింద పడిపోయినాడు.

అది చూసి తల్లి అతని అన్నలు కలసి ముజీబ్ ను పిట్లం ఆసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆసుపత్రికి తరలించగా అక్కడ డాక్టర్ చనిపోయినాడు అని చెప్పినాడు ఇట్టి విషయంలో ఫిర్యాది మేరకు పిట్లం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. పరిశోధనలో భాగంగా మృతుని ఇంటి వారిని, గ్రామస్తులను, విచారించి మహమ్మద్ షాదుల్  షాదుల్లాను నేరస్తునిగా  గుర్తించి అరెస్టు చేశారు. ఇట్టి విషయములో సాక్షులను విచారించి, సరియగు సాక్షాలను సేకరించి నేరస్తుడిపై కోర్టు యందు అభియోగ పత్రం వేయడం జరిగింది.

కేసులో సాక్షులను విచారించి, సాక్షాదారాలను పరిశీలించి కేసు రుజువు కావడం జరిగినదని   న్యాయ మూర్తి కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి గౌరవ లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ జీవిత ఖైదు విధిస్తూ   5000/- రూపాయల జరిమాన విధిస్తూ  బలమైన  తీర్పు ఇచ్చారు. పోలీసు తరపున వాదనలు వినిపించిన పీపీలు దామోదర్ రెడ్డి , సూర్య ప్రసాద్, ఈ కేసును  సరియగు పద్దతిలో విచారణ చేసిన అప్పటి  బాన్స్వాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేకర్, యస్ఐ  రంజిత్, ప్రస్తుత బాన్స్ వాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్, యస్ఐ రాజు. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్సై మురళి, CDO కిషన్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.