calender_icon.png 18 April, 2025 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓల్డ్ మలక్‌పేటలో దారుణం.. అక్కను చంపిన తమ్ముడు

10-04-2025 08:31:23 AM

హైదరాబాద్: కుటుంబ కలహాలు, క్షణికావేశంతో తోడబుట్టిన వారిపై దాడి చేసి హత్య చేస్తున్నారు. కొందరు మద్యం మత్తులో చేస్తుంటే.. మరికొందరు ఆస్తుల కోసం మనతో పాటు పెరిగిన వారినే మట్టుబెడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ (Chadarghat Police Station) పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అక్కను తోడబుట్టిన తమ్ముడు కత్తితో దాడి చేసి హత్య చేసిన దారుణ సంఘటన ఓల్డ్ మలక్( Old Malakpet) పేటలో చోటుచేసుకుంది. . మృతురాలిని లక్ష్మిగా గుర్తించారు. కుటుంబ కలహాల వల్లే నిందితుడిని మదన్ బాబు హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడు మదన్ బాబును అరెస్టు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.