calender_icon.png 4 March, 2025 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమ్ముడి దాడిలో అన్న మృతి

04-03-2025 05:29:13 PM

చేగుంట,(విజయక్రాంతి): కుటుంబ కలహాల్లో అన్నపై తమ్ముడు దాడి చేయడంతో అన్న మృతి చెందిన సంఘటన మాసాపేట మండల కేంద్రంలో జరిగింది.  స్థానికుల వివరాల ప్రకారం...  గ్రామానికి చెందిన దుంపల రాజు, అతని తమ్ముడు చందు  కుటుంబ కలహాల నేపథ్యంలో సోమవారం రాత్రి గొడవ  పడ్డారు. ఈ గొడవలో తమ్ముడు చందు, అన్న రాజుపై దాడి చేయడంతో రాజు అక్కడికి అక్కడే మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్  ప్రభుత్వాసుపత్రికి  తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.