హైదరాబాద్ సెయిలింగ్ వీక్
హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌లో తెలంగాణకు చెందిన మాన్య రెడ్డి, లావేటి ధరణి కాంస్య పతకాలతో మెరిశారు. ఈఎమ్‌ఈ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 38వ సెయిలింగ్ వీక్ ఐఎవసీఏ 4 మహిళల విభాగంలో మాన్య రెడ్డి, ఐఎల్‌సీఏ 6 ఈవెంట్‌లో లావేటి ధరణి కంచు పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.