11-04-2025 12:00:00 AM
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్
హనుమకొండ, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే నివాస క్యాంపు కార్యాలయం నందు ఇటీవల జరిగిన ఖేల్ ఇండియా యూత్ గేమ్స్ నేషనల్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పెన్సింగ్ స్పోరట్స్ లో బ్రౌజ్ మోడల్ సాధించిన గొర్రె శ్రీజను మోడల్ అందజేసి, శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందించి శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.
అనంతరం మాట్లాడుతూ ఖేల్ ఇండియా నేషనల్ బ్రౌజ్ మోడల్ సాధించేందుకు కృషిచేసిన తండ్రి గొర్రె కిరణ్, కోచ్ సురేష్ లను అభినందించి సాల్వాలతో సత్కరించి, అలాగే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ వారికి ప్రోత్సాహాలను అందిస్తూ మంచి గుర్తింపును, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని తెలియజేస్తూ క్రీడాకారిణి శ్రీజ మరిన్ని పథకాలు సాధించాలని, ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పెంచింగ్ కోచ్ సురేష్ కృష్ణ, టి ఎస్ ఏ ప్రభాకర్ రెడ్డి, సందీప్ కుమార్, జ్ఞానేంద్ర ఫౌండేషన్ పవన్ కుమార్ శర్మ తోపాటు తదితరులు పాల్గొన్నారు.