calender_icon.png 2 November, 2024 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంస్యమే లక్ష్యంగా

05-08-2024 12:05:00 AM

  1. సెమీస్‌లో ఓడిన భారత స్టార్ లక్ష్యసేన్ 
  2. నేడు కాంస్య పతక పోరు

పారిస్: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. విశ్వక్రీడల్లో సెమీస్ చేరి సంచలనం సృష్టించిన లక్ష్యసేన్ కీలకపోరులో ఓటమిపాలయ్యాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో లక్ష్యసేన్ 2014 ప్రపంచ రెండో ర్యాంకర్ విక్టర్ అలెక్సెన్ చేతిలో పరాజయం చవిచూశాడు. ఇప్పటికే రెండుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన అలెక్స్‌న్ అనుభవం ముందు లక్ష్యసేన్ నిలవలేకపోయాడు. 54 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో లక్ష్యసేన్ ఒకదశలో 7 ఆధిక్యంలో నిలిచాడు. అయితే ఆ తర్వాత వెనుకబడిన లక్ష్యసేన్ అలెక్స్‌న్‌కు తలవంచాడు. ఇక రెండో గేమ్‌లో పూర్తిగా ఒత్తిడికి తలొగ్గిని లక్ష్యసేన్ ఓటమి దిశగా పయనించాడు.

సెమీస్‌లో ఓడినప్పటికీ లక్ష్యసేన్ ముందు కాంస్య పతక రూపంలో మరో అవకాశముంది. నేడు జరగనున్న కాంస్య పతకపోరులో మలేషియాకు చెందిన లీ జి జియాను లక్ష్యసేన్ ఎదుర్కోనున్నాడు.  ఈ ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తారనుకున్న పీవీ సింధు, సాత్విక్,చిరాగ్ జోడీ తీవ్రంగా నిరాశపరిచారు. వరుసగా రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించి చరిత్ర సృష్టించిన సింధూ ఈసారి ప్రిక్వార్టర్స్‌కే పరిమితమవ్వగా.. డబుల్స్‌తో కచ్చితంగా దేశానికి పతకం తీసుకువస్తారనుకున్న సాత్విక్ జోడీ క్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టింది.

2012 ఒలింపిక్స్ నుంచి చూసుకుంటే భారత్‌కు బ్యాడ్మింటన్‌లో కనీసం ఒక్క పతకమైనా వస్తుంది. ఈసారి లక్ష్యసేన్ కాంస్య పతక పోరులో విజయం సాధించి దేశానికి నాలుగో పతకం అందిస్తాడా లేదా అనేది చూడాలి.