ఆస్తానా: ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు కాంస్యం గెలుచుకుంది. గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 0-3 తేడాతో చైనీస్ తైపీ చేతిలో పరాజయం చవిచూసింది. శరత్ కమల్, మానవ్ థక్కర్, హర్మీత్ దేశాయ్‌లతో కూడిన భారత బృందం సెమీస్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలయ్యారు. కాగా బుధవారం మహిళల జట్టు కూడా కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక టోర్నీలో ఇరుజట్లకు కాంస్యం రావడం మామూలు విషయం కాదని భారత టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ తెలిపింది.