calender_icon.png 15 January, 2025 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాంజలికి కాంస్యం

05-09-2024 12:00:00 AM

హనోవర్: జర్మనీ వేదికగా జరుగుతున్న ప్రపంచ డెఫ్ షూటింగ్ చాంపి యన్‌షిప్‌లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ఈ టోర్నీ లో 12 పతకాలు సాధించగా తాజాగా మరో పతకం వచ్చి చేరింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ పోటీల్లో భారత షూటర్ ప్రాంజలి ధుమాల్  కాంస్య పతకం గెలుచుకుంది. ఫైనల్లో 571 పాయింట్లు సాధించిన ప్రాంజలి మూడో స్థానంలో నిలిచింది. ఇక ఉక్రెయిన్‌కు చెందిన సోఫియా, మోసినా స్వర్ణ, రజతాలు కైవసం చేసుకున్నారు. మరో షూటర్ అనూయప్రసాద్558 పాయింట్లతో ఐదో స్థానంలో నిలి చింది. ఇక టోర్నీలో భారత్ మొత్తం 13 పతకాలు సాధించగా.. అందులో మూడు స్వర్ణాలు, ఆరు రజతాలు, నాలుగు కాంస్యాలు ఉన్నాయి.