కజన్ (రష్యా): బ్రిక్స్ 2024 గేమ్స్‌లో భారత్ ఖాతాలో తొలి పతకం చేరింది. రష్యా వేదికగా జరుగుతున్న గేమ్స్‌లో మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్లో పోయ్మంతీ బైస్యా, మౌమిత దత్తా, యషిని శివశంకర్‌లతో కూడిన భారత యువ జట్టు కాంస్యంతో మెరిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 1 తేడాతో చైనా చేతిలో పరాజయం చవిచూసింది. తొలుత యషిని 11 4 11 7 11 చైనాకు చెందిన వాంగ్ గ్జియానన్ను ఓడించి భారత్‌కు 1 ఆధిక్యం అందించింది. అయితే తర్వాత బైస్యా, మౌమితలు ఓటమి పాలవ్వడంతో భారత యువ జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఇక పురుషుల టేబుల్ టెన్నిస్‌లో అనిర్బన్ ఘోష్, జీత్ చంద్ర, స్నేహిత్ల జోడీ ఐదో స్థానంతో టోర్నీని ముగించింది. 5,6 స్థానాల కోసం జరిగిన పోటీల్లో భారత్ 3 బహ్రెయిన్‌పై విజయం సాధించింది.