calender_icon.png 15 January, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత్ కు కాంస్యం

08-08-2024 08:07:28 PM

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో కాంస్యం పతకం దక్కింది. భారత పురుషుల హాకీ జట్లు కాంస్య పతక పోరులో స్పెయిన్ పై భారత్ గెలుచుకుంది. స్పెయిన్ పై 2-1 తేడాతో భారత హాకీ జట్టు విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ లోనూ భారత హాకీ జట్టు కాంస్యం గెలిచింది. కాగా, తాజాగా హాకీలో సాధించిన కాంస్యంతో భారత్ పారిస్ ఒలింపిక్స్ లో సాధించిన పతకాల సంఖ్య 4కు పెరిగింది. ఇంతకుముందు షూటింగ్ లో మూడు పతకాలు వచ్చాయి. 10 మీటర్ల మహిళల వ్యక్తిగత ఎయిర్ పిస్టల్ లో మాను భాకర్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ లో మనుభాకర్-సరభ్ జోత్ సింగ్, పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్ లో స్వప్నిల్ కుశాలే కాంస్యాలు సాధించారు.