calender_icon.png 22 January, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధనుశ్‌కు కాంస్యం

21-09-2024 12:00:00 AM

లియోన్ (స్పెయిన్): ఐడబ్ల్యూఎఫ్ జూనియర్ ప్రపంచ వెయి ట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ లొగానథన్ ధనుశ్ మెరిశాడు. పురుషుల 55 కేజీల విభాగంలో ధనుశ్ కాంస్యం సాధించాడు. మొత్తంగా 231 కేజీలు ఎత్తిన ధనుశ్ స్నాచ్ విభాగంలో 107 కేజీలు ఎత్తి కాంస్యం దక్కించుకున్నాడు. క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 124 కేజీలు ఎత్తిన ధనుశ్ 13వ స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా ధనుశ్ నిలిచాడు. వియత్నాం లిఫ్టర్ డుయోంగ్ (253 కేజీలు), జపాన్ లిఫ్టర్ టొమారి కొటారొ (247 కేజీలు) వరుసగా స్వర్ణ, రజతాలు కైవసం చేసుకున్నారు. మహిళల విభాగంలో 45 కేజీల ఈవెంట్‌లో పాల్గొన్న పాయల్ 150 కేజీలు ఎత్తి ఆరో స్థానంలో నిలిచింది.