calender_icon.png 22 December, 2024 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శౌర్యకు కాంస్యం

18-07-2024 12:33:07 AM

ప్రపంచ స్కాష్ టోర్నీ

న్యూఢిల్లీ: భారత స్కాష్ ప్లేయర్ శౌర్య బవా సంచలన ప్రదర్శన ముగిసింది. హూస్టన్ వేదికగా ప్రపంచ జూనియర్ స్కాష్ చాంపియన్‌షిప్ టోర్నీలో శౌర్య కాంస్య పతకం నెగ్గాడు. బుధవారం జరిగిన సెమీఫైనల్లో శౌర్య 5 5 9 మొహ్మద్ జకారియా (ఈజిప్ట్) చేతి లో పరాజయం చవిచూశాడు. 41 నిమిషాల పాటు జరిగిన సెమీస్‌లో తొలి రెండు గేములను త్వరగానే కోల్పోయినప్పటికీ మూడో గేమ్‌లో పోరాడాడు. అయితే అనుభవం ముందు తలవంచిన శౌర్య కాంస్యం తో టోర్నీని ముగించాడు. 2014లో కుష్ కుమార్ తర్వాత ప్రపంచ స్కాష్ టోర్నీలో సెమీస్ చేరిన రెండో ఆటగాడిగా శౌర్య రికార్డులకెక్కాడు.