07-04-2025 12:35:00 AM
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 6 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుప త్రిలో రోగుల కోసం ఏర్పాటు చేసిన విరిగిన కుర్చీలతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తీవ్ర జ్వరం అలసట ఒళ్ళు నొప్పులు తదితర సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులు కుర్చీలు సక్రమంగా లేకపోవడంతో ఆరుబయట మెట్లపై కూర్చుని ఎండకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
సుమారు మూడు నెలల క్రితం ఆసుపత్రిలో ఆయా వార్డుల్లో అవుట్ పేషెంట్ల కోసం కుర్చీలు తీసుకొచ్చామని అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. అట్టి కుర్చీలు ఏర్పాటు చేసిన మూడు నెలలకే విరిగిపోవడంతో నాసిరకమైన కుర్చీలను ఏర్పాటు చేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాంటి టెండర్లు వేయకుండానే కుర్చీలను సామాగ్రిని కొనుగోలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.