calender_icon.png 24 April, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిఆర్టియు ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ

23-04-2025 05:03:26 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాలలో మే 1వ తేదీన జరిగే మేడే కార్యక్రమంను మే 20వ తేదీన జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని మునగాల రైస్ మిల్ హమాలీ కార్మికుల సమావేశంలో కరపత్రం ఆవిష్కరణలో పాల్గొన్న బిఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్, బిఆర్టియు సూర్యాపేట జిల్లా అద్యక్షుడు వెంపటి గురూజీ. ఈ సందర్భంగా బిఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్, బిఆర్టియు సూర్యాపేట జిల్లా ప్రెసిడెంట్, హమాలీ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంపటి గురూజీ మాట్లాడుతూ... మేడే కార్యక్రమం జయప్రదం చేయాలని అన్ని రైస్ ఇండస్ట్రీస్ వద్ద హమాలీలు మండలం పట్టన్నాళ్ళో అన్ని సంస్థల, అడ్డాల వద్ద అన్ని రంగాల కార్మికులు మేడే జెండాలు ఎగురవేసి జయప్రదం చేయాలని అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తు కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలనీ, ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో పరిశ్రమ యాజమాన్యంకు, అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ గా కుదించి కార్మికుల హక్కులను కాల రాస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ మే 20వ తేదీన అన్ని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపు నివ్వడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో బిఆర్టియు 

మున్సిపల్ యూనియన్ సంఘం సూర్యాపేట జిల్లా అద్యక్షుడు ఆరెంపుల వెంకటాద్రి, బిఆర్టియు హమాలీ యూనియన్ నాయకులు రేసు సైదులు, లొంగి సోమయ్య, హమాలీలు సోము అప్పయ్య, లొడంగి సోమయ్య, లొడంగి సత్యం, చింతకాయల లింగయ్య, దేశగాని లింగయ్య, కోలా నర్సింగరావు, వనబోతు వెంకట్ రెడ్డి, వీరబోయిన చంద్రయ్య, దండు వీరాస్వామి, మచ్చ కుటుంబ రావు తదితరులు పాల్గొన్నారు.