23-02-2025 06:21:56 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచి ఓటు వేసిన ప్రతి ఓటు హక్కు చెల్లుబాటు అయ్యే విధంగా విస్తృత అవగాహన నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈనెల 25 26 తేదీల్లో కలెక్టర్ కార్యాలయంలో పట్టబద్రులు ఉపాధ్యాయులకు ఓటు వేసే విధానంపై నమూనా పోలింగ్ అవగాహన సదస్సును నిర్వహించి ఓటు చెల్లుబాటు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఓటింగ్ వేసే విధానంలో ఓటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు టిక్ మార్కింగ్ విదానం ఫోటో గుర్తింపు కార్డులు పోలింగ్ బూత్ లు తదితర వివరాల సమాచారం అందించేందుకు సిబ్బంది అందుబాటులో ఉంటారని దీన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.