calender_icon.png 23 January, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25న బీసీల విస్తృతస్థాయి సమావేశం

23-01-2025 01:54:58 AM

జాజుల శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): ఈనెల 25న హైదరాబాద్‌లో బీసీల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలో త్వరలో జరగబోయే శాసనమండలి ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించాలని, బీసీ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ చర్చించి ప్రకటించడానికి వివిధ బీసీ సంఘాలు, బీసీ మేధావులతో రాష్ర్ట విసృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకవైపు బీసీ కులగణన చేస్తూనే, ఇంకొక వైపు బీసీలకు టికెట్లు ఇవ్వకుండా రాజకీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.