calender_icon.png 16 January, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిటన్ చదువులు మరింత ఫిరం

17-09-2024 05:49:13 AM

ఖాతాలో నెలకు రూ.1.64 లక్షల ఉండాల్సిందే 

లండన్, సెప్టెంబర్ 15: బ్రిటన్‌లో ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం మరింత భారం మోపింది. 2020 సంవత్సరం తర్వాత మరోసారి విద్యార్థుల నెలవారీ ఖర్చులకు అవసరమయ్యే డబ్బుల పరిమితిని పెంచింది. ప్రతి నెలా 1483 పౌండ్లు (రూ.1.64 లక్షలు) సేవింగ్స్ రూపంలో విద్యార్థుల ఖాతాల్లో ఉంచుకోవాల్సి వస్తుంది. కోర్సును కొనసాగిస్తున్న సమయంలో తమ వద్ద ప్రభుత్వం సూచించిన మొత్తం ఉన్నట్లు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.

బ్రిటన్‌లో విద్యనభ్యసించే విదేశీ విద్యార్థులకు ఆర్థికంగా ఎలా ంటి ఆటంకం రావొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త నిబంధనలు 2025 జనవరి నుంచి అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం ప్రతినెలా సేవింగ్స్ నిధుల పరిమితి 1334 పౌండ్లు ఉండగా 11 శాతం పెంచారు. లండన్ వెలుపల చదివే విద్యార్థులు రూ.1.25 లక్షలు చూపిస్తే సరిపోతుంది. 9నెలల కంటే ఎక్కువకాలం చదివేవారు వీసా సమయంలో రూ.14.77 లక్షలు తమ ఖాతాలో చూపించాలి.