calender_icon.png 20 April, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు బ్రిటన్ ఎన్నికల ఫలితాలు

05-07-2024 01:36:26 AM

హోరాహోరీగా జనరల్ ఎన్నికలు

యూకే (బ్రిటన్) జూలై 4: యునైటెడ్ కింగ్‌డమ్ జనరల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది.  లక్షలాదిమంది బ్రిటన్ పౌరులు పోలింగ్‌లో పాల్గొని తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఒపీనియన్ పోల్ ప్రకారం కెయిర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ బంపర్ మెజార్టీతో విజయం సాధిస్తుందని స్పష్టం అవుతోంది.  14 ఏళ్లపాటు అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి తప్పేలా లే దు.పోలింగ్‌కు ముందు రిషి సునాక్ మాట్లాడుతూ.. లేబర్ పార్టీకి ఓటు వేయాలి అనుకునేవారు ఒకసారి ఆ లోచించండి. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ట్యాక్స్‌లు రెట్టింపు అవుతాయి. స్టార్మర్ కన్జర్వేటివ్ హెచ్చరికలను ఓటర్ అణిచివేతగా తోసిపుచ్చారు. వారు ప్రజలను ఓటు వేయకుండా ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రెండో విజయంపై ఆయన ఆశలు పెట్టుకున్నారు.