లండన్, ఆగస్టు 4: బ్రిటన్‌లోని ప్రధాన నగరాల్లోని వీధులన్నీ ఆదివారం అల్లర్లలో అట్టుడికాయి. వలసవాదులకు వ్యతిరేకంగా వేలమంది రోడ్లపైకి వచ్చి కనిపించిన వస్తువునల్లా ధ్వంసం చేస్తూ బీభత్సం సృష్టించారు. గతవారం వాయువ్య ఇంగ్లండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో ఓ డ్యాన్స్ క్లాస్‌లో ప్రాక్టీస్ చేస్తున్న చిన్నారులపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేయటంతో ముగ్గురు మరణించారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ వేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి వలసవాదులకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. ఆదివారం చేపట్టిన అలాంటి నిరసనలే హింసాత్మకంగా మారాయి. ఈ సందర్భంగా దాదాపు 100 మంది నిరసనకారులను అరెస్టు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.