రాజీనామా తర్వాత హసీనా భారత్‌కు వచ్చారు. ఇక్కడి నుంచి లండన్‌లో ఆశ్రయం పొందాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. అందుకు యూకే నిబంధనలు అనుమతించవని స్పష్టం చేశారు. విదేశీ వ్యక్తులకు రక్షణ కల్పించే విషయంలో బ్రిటన్‌కు మంచి రికార్డే ఉందని, కానీ ఆశ్రయం కోరుతూ లేదా తాత్కాలిక శరణార్థిగా ఒక వ్యక్తి వచ్చి స్థిరపడేందుకు ఎలాంటి నిబంధనలు లేవని తెలిపారు.
అంతర్జాతీయ రక్షణ కోరుకునేవారు మొదట చేరుకున్న సురక్షిత దేశంలోనే ఆశ్రయం పొందితే మంచిదని తేల్చిచెప్పారు. ఈ వ్యాఖ్యల ఉద్దేశం హసీనా భారత్‌లోనే ఆశ్రయం పొందాలని సూచించినట్లుగా పరోక్షంగా తెలుస్తోంది. అయితే హసీనా సోదరి రెహానా బ్రిటన్ పౌరురాలు.
ఆమె కుమా ర్తె తులిప్ అధికార లేబర్ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఈ క్రమంలోనే హసీనా బ్రిటన్ ఆశ్రయం పొందాలని భావించినట్లు తెలుస్తోంది. అందుకే రెహానాతో కలిసే హసీనా భారత్‌కు వచ్చారు. అయితే, యూకేలో ఆశ్రయానికి అనుమతి వచ్చేవరకు హసీనా భారత్‌లోనే ఉండనున్నారు.