రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో రోడ్లపై ఉన్న గుంతల పూడ్చివేతకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమ ర్పించాలని ప్రభుత్వానికి గురువారం హైకో ర్టు ఆదేశాలు జారీ చేసింది. గుంతల సమస్య పరిష్కారానికి ఓ యాప్‌ను ఎందుకు ఏర్పా టు చేయరాదని ప్రభుత్వానికి గురువారం హైకోర్టు ప్రశ్నించింది. యాప్‌లో ఎక్కడ గుంత ఉన్నా దానిపై ప్రజలు ఫిర్యాదు చేస్తారని, వాటిని పరిశీలించి పరిష్కరించాలని పేర్కొంది. ఇదే విధానం కర్ణాటకలో అమలవుతోందని తెలిపారు. ఇప్పటివరకు తీసు కున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేసింది.
రోడ్లపై గుంతలు, మ్యాన్‌హోళ్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రజలు చనిపోతున్నారని, వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని, మృతి చెందినవారికి పరిహారం అందించేలా ఆదేశాలు జారీ చే యాలంటూ న్యాయవాది అఖిల్ గురుతేజ పిల్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ ప్రతి గంటకు ఒకరు మృతి చెందుతున్నారని, రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకా లను అమలు చేయడం లేదన్నారు. అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ రోడ్లపై గుంతలు పూడ్చివేతకు తగిన చర్యలు చేపట్టామని తెలిపారు. రోడ్ల నిర్వహణ బాధ్యతను ఆర్‌అండ్‌బీ నిర్వహిస్తోందన్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయని, అనంతరం పూర్తిస్థాయిలో చర్యలు చేపడతామన్నారు.