18-04-2025 01:57:39 AM
పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఏప్రిల్ 17: రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని ఉమ్మడి జాజిరెడ్డిగూడెం మండల పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి అన్నారు.గురువారం మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ జిల్లా నాయకులు గుడిపల్లి మధుకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు దాసరి సోమయ్య,యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మాదగాని విక్రమ్ గౌడ్,మాజీ సర్పంచ్ జాల నర్సయ్య,మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాటిపాముల జలెంధర్,నాయకులు నర్సింగ వెంకటేశ్వర్లు గౌడ్,దలువాయి శ్రీధర్, సంఘం సభ్యులు జాల అవిలయ్య, మాండ్ర లింగయ్య, సూర్యం, గిలకత్తుల వీరయ్య, వల్లపు శ్రీనివాస్, నున్న లింగయ్య తదితరులు పాల్గొన్నారు