పెన్ పహాడ్ (విజయక్రాంతి): రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని తమ వద్దనే ఆరబెట్టుకొని, నాణ్యమైన ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను పొందాలని మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం సింగారెడ్డి పాలెం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. వానాకాలం కోతలు పూర్తికాగానే రైతులు తమ పంట పొలాల్లోని కొయ్యకాలను తగలబెట్టవద్దని రైతులకు సూచించారు. దీంతో భూమిలో భూసారం తగ్గుతుందని అన్నారు. కొయ్యకాలని తగలపెట్టకుండా సింగిల్ సూపర్ పాస్పెట్ తో పాటు తగిన మోతాదులో యూరియాను కలిపి వెదజల్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లు, ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులు పాల్గొన్నారు.