కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రైతులు నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. బుధవారం సిర్పూర్, కౌటాలలోని శ్రీరామ కాటన్ మిల్లు, వైష్ణవి మాత జిన్నింగ్ మిల్లుల్లో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.7521 ప్రతి క్వింటాలకు చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అన్నదాతలు నష్టపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య, సిపిఓ వెంగల్ రెడ్డి, ఏడి మనోహర్, ఏఎంసీ సెక్రెటరీ భాస్కర్, ఏఓలు గిరిషన్, ప్రేమలత, వ్యాపారులు హనుమంతు రావు, చిలువేరు ప్రవీణ్, బిజెపి జిల్లా కార్యదర్శి బండి రాజేందర్ నాయకులు శంకర్, వాసు పటేల్, సత్యనారాయణ, సత్తయ్య, మల్లయ్య, నాన్నయ్య, అశోక్, భీమన్న, తుకారాం, లావణ్య, రైతులు పాల్గొన్నారు.